న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసుకున్నా జనసేన పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో మనోడు దారికొచ్చాడు. తనకు జరిగిన డ్యామేజ్ ను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఆపై పవన్ కళ్యాణ్ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్ర దోపిడీదారుల నుంచి తెలంగాణ ఇంకా విముక్తం కాలేదని పేర్కొన్నారు. ఈ తరుణంలో తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో తెలంగాణ సమాజం సీరియస్ గా స్పందించింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రముఖ న్యూస్ మీడియా ఏఎన్ఐ ఎడిటర్ తో జరిగిన ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ఆసక్తికర ఆన్సర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. తనకు తెలంగాణ ముఖ్యం కాదన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కావాలన్నారు. దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడతానని , ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇకనైనా ఇక ముందైనా లేదా ఎప్పటికీ తాను తెలంగాణ నుంచి పోటీ చేసే ఛాన్స్ లేదన్నారు. ఈ విషయం గురించి మరో మాట మాట్లాడేది లేదని పేర్కొన్నారు. అసలు తెలంగాణ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి లేదని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ద్వారా తెలంగాణ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.