Telugu Mahasabhalu : జ‌న‌వ‌రిలో తెలుగు మ‌హాస‌భ‌లు

ఆంధ్ర సార‌స్వ‌త ప‌రిష‌త్ చీఫ్

Telugu Mahasabhalu : రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది ఉత్సవాల నీరాజనం గా 2వ అంతర్జాతీయ తెలుగు మహా సభలను వ‌చ్చే ఏడాది జనవరి 5 6,7 తేదీలతో నిర్వ‌హించ‌నున్నారు.

ఈ విష‌యాన్ని ఆంధ్ర సార‌స్వ‌త ప‌రిష‌త్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ గ‌జ‌ల్ శ్రీ‌నివాస్, చైత‌న్య విద్యా సంస్థ‌ల చీఫ్ చైత‌న్య రాజు, ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి రెడ్డ‌ప్ప ధ‌వేజీ వెల్ల‌డించారు.

Telugu Mahasabhalu Dates

ఆంధ్ర మేవ జయతే అన్న నినాదంతో తెలుగు భాష లోని 25 సాహితీ ప్రక్రియలపై ప్రముఖులతో సదస్సులు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలాది మంది విద్యార్థులు తెలుగు సంస్కృతి(Telugu Mahasabhalu) , భారతీయతల పై సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, పీఠాధిపతులు , చలన చిత్ర ప్రముఖులు అతిథులుగా రానున్నారని స్ప‌ష్టం చేశారు.

ప్రాంగణం లో ఒక ప్రధాన వేదిక, రెండు ఉప వేదికలు, గ్రంధాల, ఆయుర్వేద, చిరు ధాన్యాలు, , కొండపల్లి, లేపాక్షి, ఏటికొప్పాక కళలు , తెలుగు వైభవం చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంప్రదాయ కళల తో పాటు సంచార జాతుల కళా ప్రదర్శనలకు కూడా పెద్ద పీట వేస్తామన్నారు.

50 దేశాల నుండి ప్రతినిధులు హాజరు అయ్యే అవకాశం ఉందని, రాష్ట్రేతర తెలుగు సంఘాల వారిని కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ప్రవేశ రుసుము లేకుండా మహా సభల సాంస్కృతిక, సాహితీ వేదికల నిర్వహణ జరుగుతుందని తెలిపారు.

సదస్సులు, కవి సమ్మేళనాలతో కలిపి పాల్గొనేవారు 3000 మంది , సాంస్కృతిక కార్యక్రమాలు 15 వేల మంది వీక్షించే సదుపాయం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేశిరాజు రామప్రసాద్, శర్మ ముఖ్య సమన్వయ కర్తలుగా ఉంటారని స్ప‌ష్టం చేశారు. త్వరలో తెలుగు మహా సభలు 2024 వెబ్ సైట్ కూడా ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు.

Also Read : TSPSC : గ్రూప్ -2 అభ్య‌ర్థుల‌కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!