క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు దేశానికి ఎగుమతి చేస్తాం
సేల్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో మంత్రి నారా లోకేష్
జమ్మలమడుగు : ఈరోజు కేవలం ఒక సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు, దార్శనికత, నమ్మకం, వేగం, కార్యనిర్వహణ కలగలిసిన వేడుక అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టి.కొండూరు గ్రామంలో రూ.3 వేలకోట్లతో నిర్మించిన సుఖ్ బీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ (SAEL) వారి 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు. మా నాన్న ఉత్తరం రాశారు.. మా తాత కల కన్నారు.. నేను ఆత్మలతో మాట్లాడాను అంటే నమ్మే వాళ్ళు ఎవరు లేరు బ్రదర్. మా బ్రాండ్ జాబ్ క్రియేషన్ మీ బ్రాండ్ గొడ్డలి అంటూ ఎద్దేవా చేశారు జగన్ రెడ్డిని ఉద్దేశించి. రెండింటికీ ఎంతో తేడా ఉందని అన్నారు.
రికార్డ్ టైమ్ లో SAEL ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందన్నారు నారా లోకేష్. ఇది స్థానిక రైతుల విజయం, జమ్మలమడుగు యువత విజయం. మీ సహకారం వల్లనే ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లో పూర్తి అయిందని ప్రశంసించచారు. రాష్ట్రం మొతం జమ్మలమడుగు వైపు చూస్తోందని చెప్పారు. ఈరోజు ఇతర నియోజకవర్గాల వాళ్ళు మాకు కూడా ఇటువంటి కంపెనీలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ మెగా సోలార్ పార్క్ ఏర్పాటు చేసింది మనమే. ఇప్పుడు SAEL తీసుకు వచ్చింది మనమే. అదానీ, చింతా గ్రీన్, జెన్కో – NTPC పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్లు తీసుకొచ్చింది మనమేనని గుర్తు చేశారు లోకేష్. . SAEL రావడం వల్ల రైతులకు లబ్ధి జరిగిందన్నారు, యువతకు ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. కంపెనీలు తీసుకు రావాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా అది ఒక్క మన బ్రాండ్ సీబీఎన్ కి మాత్రమే సాధ్యమని అన్నారు.