త‌మిళ‌నాడు మంత్రివ‌ర్గంలో 23 మందికి కొత్త‌గా చోటు

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సీఎం జోసెఫ్ విజ‌య్

చెన్నై :త‌మిళ‌నాడు సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్ప‌టికే కొందరు మంత్రులుగా కొలువు తీర‌గా తాజాగా మ‌రో 23 మందిని త‌న మంత్రి వ‌ర్గంలోకి చేర్చుకున్నారు. గురువారం గ‌వ‌ర్న‌ర్ తో ప్ర‌మాణ స్వీకారం చేయించారు. తాజా కేబినెట్ లో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండ‌గా ఇద్ద‌రు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి చోటు క‌ల్పించారు సీఎం విజ‌య్. ఇక ఇవాళ లోక్ భ‌వ‌న్ లో ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో తూత్తుకుడికి చెందిన శ్రీ‌నాథ్, అవినాశి ఎమ్మెల్యే క‌మ‌లి. ఎస్. కుమార పాలెంకు చెందిన విజ‌య‌ల‌క్ష్మి, కాంచీపురంకు చెందిన ఆర్ వి రంజిత్ కుమార్ , కుంభ‌కోణం ఎమ్మెల్యే వినోద్ కు చోటు క‌ల్పించారు.

వీరితో పాటు తిరువాడ‌నై ఎమ్మెల్యే రాజీవ్, క‌డ‌లూరు ఎమ్మెల్యే బి. రాజ్ కుమార్, అరక్కోణం ఎమ్మెల్యే వి. గాంధీ రాజ్, ఒట్ట పిడారం కు చెందిన మ‌థ‌న్ రాజా. పి. , రాజ‌పాళ‌యం కు చెందిన కె. జ‌గ‌దీశ్వ‌రి, క‌లియూరు కు చెందిన ఎస్. రాజ్ కుమార్, ఈరోడ్ ఈస్ట్ కు చెందిన ఎం. విజ‌య్ బాలాజీ, రాశీపురం కు చెందిన లోగేష్ త‌మిళ సెల్వ‌న్ కు చోలు ద‌క్కింది.

వీరితో పాటు సేలం సౌత్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే విజ‌య్ త‌మిళ‌న్ పార్తిబ‌న్ , శ్రీ‌రంగంకు చెందిన ర‌మేష్ , మేలూర్ కు చెందిన పి. విశ్వ‌నాథ‌న్, వేలాచ్చేరికి చెందిన ఆర్. కుమార్, శ్రీ‌పెరంపుధూర్ కు చెందిన తెన్న‌ర‌సు. కె, కోయంబ‌త్తూరు నార్త్ కు చెందిన వి. సంప‌త్ కుమార్, అరంతాగికి చెందిన మొహ‌మ్మ‌ద్ ఫ‌ర్వాస్ , తాంబ‌ర‌కు చెందిన డి. శ‌ర‌త్ కుమార్, రాదాకృష్ణ‌న్ న‌గ‌ర్ కు చెందిన ఎన్.మేరీ విల్స‌న్ , కిణ‌తుక‌డ‌వుకు చెందిన విఘ్నేష్ కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

Leave A Reply

Your Email Id will not be published!