IND vs WI 1st ODI : రసవత్తర పోరులో భారత్ దే విజయం
చివరి దాకా పోరాడి ఓడిన వెస్టిండీస్
IND vs WI 1st ODI : విండీస్ టూర్ లో టీమిండియా బోణీ కొట్టింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు(IND vs WI 1st ODI) 3 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై ఉత్కంఠ భరిత విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్న రీతిలో సాగింది మ్యాచ్.
309 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది భారత్. అయినా కంగారు పడకుండా ఛేదించే ప్రయత్నం చేశారు విండీస్ ఆటగాళ్లు. అకేల్ హుస్సేన్ 33, రొమారియో షెపర్డ్ 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
వీరిద్దరూ చివరి దాకా గెలిపిస్తారని అనుకున్నారు. కానీ భారత బౌలర్లు చాకచక్యంగా బంతులు వేయడంతో చివరకు ఓటమి తప్పలేదు విండీస్ కు. నిర్ణీత 50 ఓవర్లలో వెస్టిండీస్ 305 పరుగులు మాత్రమే చేసింది.
కైల్ మేయర్స్ 75 పరుగులతో రాణిస్తే బ్రాండన్ కింగ్ 54 రన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇండియా బౌలర్లలో సిరాజ్ , శార్దూల్ ఠాకూర్ , యుజ్వేంద్ర చహల్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇక ఎలాంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగిన భారత జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 99 బంతులు ఆడి 3 సిక్స్ లు 10 ఫోర్లతో 97 పరుగులు చేశాడు.
కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. శుభ్ మన్ గిల్ 53 బంతులు ఆడి 6 ఫోర్లు 2 సిక్స్ లతో 64 రన్స్ చేస్తే శ్రేయస్ అయ్యర్ 57 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టు కోలేదు. భారత్ ప్రస్తుతం 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
Also Read : ఆ ఇద్దరు టీమిండియాకు అవసరం
