Kiren Rijiju Rahul Gandhi : రాహుల్ ది వ్యతిరేక శక్తుల భాష
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
Kiren Rijiju Rahul Gandhi : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కిరణ్ రిజిజు రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. ఆయనకు భారత దేశం పట్ల గౌరవం ఏమాత్రం లేదన్నారు. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులు మాట్లాడుతున్న భాషను ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు.
తన మాటల ద్వారా భారత దేశాన్ని కించ పరిచే హక్కు ఆయనకు లేదన్నారు కేంద్ర మంత్రి. తాము సహించే ప్రసక్తి లేదన్నారు కిరెన్ రిజిజు. ఆయన కావాలని భారత దేశ పరువును తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని దీనిని తాము అడ్డుకుని తీరుతూనే ఉంటామన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగానే ఉందని, అందుకే ఆయన విదేశాల్లో మాట్లాడటం జరుగుతోందన్నారు. ఒకవేళ రాచరిక పాలన అయి ఉంటే దేశం విడిచి వెళ్లే వారా అని ప్రశ్నించారు. భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడటం దారుణమన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి. ఆయన ముఠా భాష మాట్లాడటం అభ్యంతరకరమన్నారు.
రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్ సాక్షిగా చెప్పాలని తాము కోరామని, ఇదే సమయంలో దేశ ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంటుందన్నారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని కాంగ్రెస్ భావిస్తే పార్లమెంట్ లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అర్హత లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju Rahul Gandhi) స్పష్టం చేశారు.
Also Read : సిసోడియాకు షాక్ మరో కేసు నమోదు