Paritala Sunitha : వైసీపీ ప‌త‌నానికి సంకేతం – సునీత‌

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై మాజీ మంత్రి

Paritala Sunitha : ఏపీ రాష్ట్రంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. మూడు గ్రాడ్యుయేట్ స్థానాల్లో విజ‌య ఢంకా మోగించింది. విచిత్రం ఏమిటంటే ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌ట్టు క‌లిగిన పులివెందుల లో సైతం టీడీపి గెలుపు జెండా ఎగుర వేయ‌డం కొంత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. టీడీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డంపై స్పందించారు దివంగ‌త ప‌రిటాల స‌తీమ‌ణి, మాజీ మంత్రి ప‌రిటాల సునీత‌(Paritala Sunitha).

రాబోయే రోజుల‌లో అక్ర‌మాలు, దౌర్జ‌న్యాల‌కు , అవినీతికి పాల్ప‌డుతున్న వైసీపీ స‌ర్కార్ కు చెంప ఛెల్లుమ‌నిపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఈ విజ‌యం త‌మ పార్టీకి మ‌రింత బ‌లాన్ని ఇచ్చింద‌ని చెప్పారు ప‌రిటాల సునీత‌. జ‌గ‌న్ రెడ్డి నోట వై నాట్ 175 అంటే చూడాల‌ని ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న వెనుక ఉన్న వారంద‌రికీ ఇది ఓ చెంప దెబ్బ అన్నారు. అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు ప‌రిటాల సునీత‌.

అధికారం ఉంది క‌దా అని మిడిసి ప‌డితే ఇలాగే ఫ‌లితాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి. ఇక‌నైనా క‌ళ్లు తెరిచి ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా పాల‌న సాగించాల‌ని జ‌గ‌న్ రెడ్డికి సూచించారు. ఎవ‌రికీ ప‌వ‌ర్ శాశ్వతం కాద‌న్నారు. ఎవ‌రు ఏమిటో అనేది ఇప్పుడు ప్ర‌జ‌లు గ్ర‌హించార‌ని వారు త‌ప్ప‌క బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. త‌న అడ్డాలో కూడా టీడీపీ జెండా ఎగుర వేశామ‌న్నారు మాజీ మంత్రి(Paritala Sunitha).

Also Read : ఈ విజ‌యం శుభ సూచ‌కం – బాల‌య్య‌

Leave A Reply

Your Email Id will not be published!