Chandrababu Naidu : పంట న‌ష్ట పోతే ప‌రామ‌ర్శించ‌రా

జ‌గ‌న్ పై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని మ‌రోసారి టార్గెట్ చేశారు. రాష్ట్రంలో అకాల వ‌ర్షాల కార‌ణంగా పంట‌లు న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకోవాల్సిన సీఎం నిద్ర పోతున్నారా అంటూ ప్ర‌శ్నించారు చంద్ర‌బాబు.

శ‌నివారం ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించారు. కొవ్వూరు, నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పంట‌లు కోల్పోయిన రైతుల‌తో ప‌రామ‌ర్శించారు. చాగ‌ల్లు మండ‌లం లోని ఐపంగిడి, చాగ‌ళ్లు, ఊన‌గ‌ట్ల‌, త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు.

పంట‌లు కోల్పోయిన రైతుల‌కు భ‌రోసా ఇచ్చారు. ఆదుకోవాల్సిన స‌ర్కార్ రాజ‌కీయం చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. తాను ప‌ర్య‌టించిన త‌ర్వాత‌నే ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి స్పందిస్తున్నార‌ని లేక పోతే ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇది మంచి పద్ద‌తి కాద‌న్నారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. పంట‌లు కోల్పోయిన రైతుల‌కు పూర్తి న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. ఇక‌నైనా జ‌గ‌న్ మారాల‌ని బాధ్య‌తాయుతంగా పాల‌న సాగించాల‌ని కోరారు. లేక‌పోతే ప్ర‌జ‌లు తిర‌గ‌బడే రోజు త‌ప్ప‌క వ‌స్తుంద‌న్నారు. జ‌నం మార్పు కోరుకుంటున్నార‌ని త‌మ‌కు ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శికి రూ. 18 ల‌క్ష‌లా

Leave A Reply

Your Email Id will not be published!