Param Singh Panjwar : లాహోర్ లో ఖలిస్తాన్ చీఫ్ కాల్చివేత
పంజ్వార్ లో కాల్పులు జరిపిన దుండగులు
Param Singh Panjwar : ఖలిస్థాన్ కమాండో చీఫ్ పరమ్ జిత్ పంజార్ కాల్పులకు గురయ్యాడు. పాకిస్తాన్ లోని పంజ్వార్ లాహోర్ లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఇదిలా ఉండగా 1990లో ఖలిస్తాన్ కమాండర్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో కార్యకలాపాలకు దిగాడు. పాకిస్తాన్ లో ఉన్నాడు. సరిహద్దు ఆయుధాల స్మగ్లింగ్ , హెరాయిన్ ట్రాఫికింగ్ ద్వారా నిధులు సేకరించాడు.
ఉగ్రవాదిగా గుర్తింపు పొందాడు. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (కేసీఎఫ్) చీఫ్ గా ఉన్నాడు పరమ్ జిత్ పంజ్వార్ అలియాస్ మాలిక్ సర్దార్ సింగ్. శనివారం ఉదయం పాకిస్తాన్ లోని లాహూర్ లోని జోహార్ టౌన్ లో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. జోహార్ టౌన్ లోని సన్ ఫ్లవర్ సొసైటీలోని తన ఇంటి వద్ద 8 గంటల సమయంలో తన గన్ మ్యాన్ తో పాటు మోటార్ సైకిల్ పై వచ్చిన ఆగంతకులు కాల్పులకు తెగబడ్డారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన పరమ్ జిత్ పంజ్వార్ ను(Param Singh Panjwar) చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ తీసుకు వెళ్లినా ఫలితం లేక పోయింది. పంజాబ్ సర్కార్ తిరస్కరించినా పంజ్వార్ లాహోర్ లోనే నివాసం ఉంటున్నాడు. అతని భార్య, పిల్లలు జర్మనీకి మారారు. పంజాబ్ లోకి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్ , ఆయుధాల అక్రమ రవాణాలో పాల్గొన్నాడు పరమ్ జిత్ పంజ్వార్ . 1986లో కేసీఎఫ్ లో చేరాడు. లబ్ సింగ్ నిర్మూలన తర్వాత కేసీఎఫ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాడు .
Also Read : ఉగ్రవాదం గురించి మోదీకి ఏం తెలుసు
