Supreme Court Notice : ది కేరళ స్టోరీ నిషేధంపై సుప్రీం నోటీసు
తమిళనాడు సర్కార్ కు సెక్యూరిటీ కల్పించాలి
వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ సినిమాకు సంబంధించి పశ్చి మ బెంగాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పాటు తమిళనాడు సర్కార్ కూడా సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా నిషేధానికి సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎందుకు నిషేధం విధించారో చెప్పాలంటూ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతే కాకుండా తమిళనాడు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రాష్ట్ర సర్కార్ ఆయా థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు.
పశ్చిమ బెంగాల్ లో ఎందుకు నిలిపి వేయాల్సి వచ్చిందో, దానికి గల కారణాలు ఏమిటో తమకు స్పష్టం గా వివరాలు ఇవ్వాలని కోరింది కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ , జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో ది కేరళ స్టోరీ నడుస్తోంది. విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కానీ దీనికి బెంగాల్ లో ఎందుకు అభ్యంతరం చెప్పాల్సి వచ్చిందో తెలుపాలని కోరింది కోర్టు.
ఇదిలా ఉండగా ది కేరళ స్టోరీ చిత్రాన్ని నిషేధించడంపై సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇవాళ సంచలన కామెంట్స్ చేసింది. ఇది ముగ్గురు అమ్మాయిలు ఇస్లాం మతంలోకి మారిన తర్వాత వివాహంలో ఇరుక్కు పోయి ఆఫ్గన్ కు తీసుకు వెళతారు. అక్కడ ఐఎస్ఐఎస్ లో బలవంతంగా చేరుతారు. ఇదీ సినిమా కథ.
