కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కంట తడి పెట్టారు. ఆయన అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. 224 సీట్లకు గాను భారీ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో అధికారం పక్కా అని తేలి పోయింది. తాజా సమాచారం మేరకు 135 సీట్లలో లీడింగ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పూర్తిగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో నిండి పోయింది. భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరించారు.
ఈ సందర్భంగా ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువతుండడంతో సంతోషం వ్యక్తం చేశారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయన తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. తనను జైలుకు పంపించారని, తీవ్రమైన ఆరోపణలు చేశారని, కేసులు నమోదు చేశారని కానీ ప్రజలు మాత్రం తన వైపు , పార్టీ వైపు మొగ్గు చూపారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
కన్నడ ఓటర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు బిగ్ షాక్ ఇచ్చారు. అన్నీ తానై వ్యవహరించినా బొమ్మై సర్కార్ ను గట్టెక్కించ లేక పోయారన్నారు డీకే శివకుమార్. భారీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు. అంచనాలకు మించి స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళుతోంది కాంగ్రెస్ పార్టీ. కనకాపూర్ లో ఆయన లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. డీకే కు వ్యతిరేకంగా మంత్రి ఆర్. అశోక్ ను బరిలో నిలిపింది.
