Imran Khan : పాక్ ఆర్మీ ఆఫీస‌ర్ పై ఇమ్రాన్ ఫైర్

న్యాయ వ్య‌వ‌స్థ మాత్ర‌మే బాగుంది

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. ఆయ‌న త‌న‌ను అక్ర‌మంగా అరెస్ట్ చేసేందుకు ఆదేశించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు త‌లుచుకుంటే ఆర్మీ ప‌ని చేయ‌ద‌న్నారు. సుప్రీంకోర్టు త‌న అరెస్ట్ ను చ‌ట్ట విరుద్ద‌మ‌ని ప్ర‌క‌టించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టు ఖాన్ కు రెండు వారాల ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయినా త‌న‌ను అరెస్ట్ చేస్తారేమోన‌న్న భ‌యంతో ఇమ్రాన్ ఖాన్ కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే ఎక్కువ సేపు ఉండి పోయాడు.

అనంత‌రం కోర్టు ఆదేశాల మేర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆపై నేరుగా త‌న నివాసానికి వెళ్లారు. ఈ సంద‌ర్బంగా వేలాది మందిని ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప్ర‌సంగించారు. ఈ దేశంలో ఒక్క న్యాయ వ్య‌వ‌స్థ మాత్ర‌మే బాగుందని, మిగ‌తా వ్య‌వ‌స్థ‌ల‌న్నీ నిర్వీర్య‌మై పోయాయ‌ని ఆరోపించారు. సైనిక నాయ‌క‌త్వం ఎంత మాత్రం మంచిది కాద‌ని, ప్ర‌జ‌లు ఈ విష‌యంపై ఆలోచించాలని పిలుపునిచ్చారు.

ఇంట‌ర్ స‌ర్వీసెస్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మేజ‌ర్ అహ్మ‌ద్ ష‌రీఫ్ చౌద‌రి ఇమ్రాన్ ఖాన్ ను తూల‌నాడాడు. ఆయ‌న క‌ప‌టం క‌లిగిన వ్య‌క్తిగా కామెంట్ చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించాడు మాజీ ప్ర‌ధాని. నా దేశానికి నేను నిజాయితీగా సేవ‌లు అందించాను. కానీ ఆర్మీ చీఫ్ పూర్తిగా వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కు ఆద‌ర‌ణ ఉంద‌ని, పాకిస్తాన్ ప్ర‌జ‌లు త‌న‌ను కోరుకుటున్నార‌ని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్.

Leave A Reply

Your Email Id will not be published!