ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శివసేన పార్టీ మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రేతో ములాఖత్ అయ్యారు. ఆదివారం సీఎం కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికారు ఆదిత్యా ఠాక్రే. మహారాష్ట్ర రాజకీయాలలో కీలకమైన యువ నాయకుడిగా ఎదిగారు.
అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ , శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిత్యా ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్ దేశంలో , రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు ప్రత్యేకంగా. వీరిద్దరి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. ఇద్దరి నేతల ములాఖత్ పై రాజకీయ వర్గాలలో, ఇరు పార్టీలలో చర్చకు దారి తీసేలా చేసింది.
ఇదిలా ఉండగా ఇటీవలే మహారాష్ట్ర సంక్షోభం, ఢిల్లీ, కేంద్రం మధ్య నెలకొన్న వివాదాలకు సంబంధించిన కేసులలో సంచలన తీర్పులు వెలువరించింది సుప్రీంకోర్టు. మరాఠాకు సంబంధించి అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, స్పీకర్ తప్పు చేశరాని, చట్టాన్ని ధిక్కరించారంటూ సీజేఐ చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం సంచలన కామెంట్స్ చేసింది.
ఇదే సమయంలో ఢిల్లీకే సర్వాధికారాలు ఉంటాయని, ఎల్జీ నామ మాత్రమేనని పేర్కొంది. కేవలం లా అండ్ ఆర్డర్, భూ సంబంధిత విషయాలకు మాత్రమే ఎల్జీకి పరిమిత అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరి భేటీ చర్చకు దారి తీసింది.
