Mallikarjun Kharge : రేపే క‌ర్ణాట‌క సీఎం ప్ర‌క‌ట‌న..?

వెల్ల‌డించ‌నున్న ఏఐసీసీ చీఫ్

క‌ర్ణాట‌క సీఎం ఎవ‌ర‌నే దానిపై ఉత్కంఠ వీడ‌నుంది. ఇప్ప‌టికే సీఎల్పీ స‌మావేశం జ‌రిగింది. మొత్తం 224 సీట్ల‌కు గాను 135 సీట్ల‌ను సాధించింది కాంగ్రెస్ పార్టీ. క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్, మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. చివ‌ర‌కు ఇద్ద‌రూ రేసులో నిలిచారు.

కానీ ఏఐసీసీ తీవ్రంగా క‌స‌ర‌త్తు చేసింది. ఇద్ద‌రు నేత‌లు మంగ‌ళ‌వారం వేర్వేరుగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క‌లుసుకున్నారు. యూపీఏ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ , ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తో సుదీర్ఘంగా చ‌ర్చించారు ఖ‌ర్గే. తుది నిర్ణ‌యం రేపు ప్ర‌క‌టించ‌నున్నారు.

క‌ర్ణాట‌క సీఎంపై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు అంద‌రి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు. అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉండేలా సీఎం అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌నున్నారు. అభ్య‌ర్థి ఎవ‌ర‌నే ప్ర‌క‌టించే ముందు సోనియా , రాహుల్ తో మ‌రోసారి భేటీ అవుతార‌ని స‌మాచారం.

మొత్తంగా క‌ర్ణాట‌క‌లో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే దానిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్టీ నిర్ణ‌యంతో సంబంధం లేకుండా తాను వెన్నుపోటు లేదా బ్లాక్ మెయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ బోనంటూ డీకే శివ‌కుమార్ ప్ర‌క‌టించారు. తాను రాజీనామా చేస్తున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ఖండించారు.

Leave A Reply

Your Email Id will not be published!