DK Shiva Kumar : స్వంత ప్రయోజనాల కంటే పార్టీ ముఖ్యం
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డీకే శివకుమార్
DK Shiva Kumar : కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వంత ప్రయోజనాల కంటే తమకు పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై తనతో పాటు సిద్దరామయ్య కూడా ఇదే విషయాన్ని హైకమాండ్ కు స్పష్టం చేశామని తెలిపారు. గురువారం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
ఎవరైనా సరే ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు ఉత్కంఠ చోటు చేసుకుంది. కర్ణాటకకు సీఎం ఎవరనే దానిపై చర్చోప చర్చలు జరిగాయి. ఇవాల్టి దాకా సీఎం రేసులో సిద్దరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా ఉన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
చివరకు సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ చివరకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆమె అంటే విపరీతమైన గౌరవం డీకే శివకుమార్ కు. సీఎం పదవి కోసం చివరి దాకా వేచి ఉన్నారు. కానీ డిప్యూటీ సీఎం గా ఉండేందుకు ఒప్పుకున్నారు డీకే శివకుమార్. శనివారం సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. లక్షలాది మంది పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విజయం కోసం శ్రమించారని చెప్పారు.
Also Read : Arjun Ram Meghwal
