Siddaramaiah DK Tour : సిద్దూ, డీకే ఢిల్లీకి పయనం
మంత్రివర్గంలో చోటుపై చర్చ
Siddaramaiah DK Tour : కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మొదటిసారిగా సీఎం సిద్దరామయ్య(Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి వారిద్దరూ చేరుకుంటారు. ఈ సందర్బంగా పార్టీ సీనియర్ నేతలతో భేటీ అవుతారు. సీఎం అధికారిక షెడ్యూల్ ప్రకారం సిద్దరామయ్య ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలు దేరి వెళతారు. రాజధానిలోనే ఉంటారు. ఇదిలా ఉండగా ఇద్దరూ వేర్వేరుగా హస్తినకు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశం అవుతారు. మంత్రివర్గ విస్తరణ , ప్రస్తుత మంత్రులకు శాఖల కేటాయింపుపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం కంటే ముందు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి చేరుకుంటారు. ఆయన గురువారం ఐఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర పార్టీ నేతలతో సమావేం కానున్నారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు.
కాగా మే 20న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా , సిద్దరామయ్య సీఎంగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి నేటి వరకు పోర్ట్ ఫోలియోలు కేటాయించ లేదు.
మే 20న ఎనిమిది మంది శాసనసభ్యులు మంత్రులుగా సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయించలేదు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం చర్చల సందర్భంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య కొన్ని పేర్లపై విభేదాలు పొడసూపాయి. దీంతో హై కమాండ్ వద్దే శాఖలు ఫైనల్ చేయాలని నిర్ణయించారు. కాగా తాజా మంత్రివర్గ విస్తరణపై భారీ ఎత్తున ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు.
224 సీట్లకు గాను 136 సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఎవరికి పదవి ఇవ్వాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పోటీ తీవ్రమైంది.
Also Read : Sukanta Mazumdar
