PM Modi : పార్ల‌మెంట్ భ‌వ‌నం ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపం

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభం

PM Modi : నూత‌నంగా నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ఆదివారం దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇది నూత‌న భ‌వ‌నం కాద‌ని 140 కోట్ల భార‌తీయుల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తీక అని పేర్కొన్నారు. కొత్త ఉద‌యానికి సాక్షిగా నిలుస్తుంద‌న్నారు. కొత్త లోక్ స‌భ ఛాంప‌ర్ లో తాను ఏర్పాటు చేసిన చారిత్రాత్మ‌క రాజ దండం సెంగోల్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చోళ సామ్రాజ్యంలో ఇది సేవ‌, జాతీయ వాదానికి చిహ్నంగా ఉంద‌న్నారు మోదీ.

ఈ ప‌విత్ర‌మైన రాజ దండం వైభ‌వాన్ని పున‌రుద్ద‌రించ‌డం మ‌న అదృష్ట‌మ‌ని అన్నారు పీఎం. ఇది కాంప్లెక్స్ అని మాత్రం విప‌క్షాలు భావిస్తున్నాయ‌ని దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. రాష్ట్ర‌ప‌తి ప్రారంభించ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ 20 కి పైగా విప‌క్షాలు బ‌హిష్క‌రించాయి కార్య‌క్ర‌మాన్ని. దీనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వారి నిర్ణ‌యం అనాలోచిత చ‌ర్యగా పేర్కొన్నారు.

భార‌త దేశం ముందుకు సాగుతోంద‌ని, కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం కూడా ప్ర‌పంచ పురోగ‌తికి దోహ‌ద ప‌డుతుంద‌న్నారు. ఈ కాంప్లెక్స్ ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అంటే స్వ‌యం అభివృద్ది చెందిన భార‌త దేశానికి ప్ర‌తీక‌గా నిలుస్తుంద‌న్నారు న‌రేంద్ర మోదీ. ఈ రాజ‌దండం అధికార మార్పిడికి ప్ర‌తీక‌. ఆదీనం సాధువులు పార్ల‌మెంట్ లో మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించారు. వారికి నా ధ‌న్య‌వాదాలు. దీనిని పున‌రుద్ద‌రించ‌డం తాను అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

Also Read : Arvind Kejriwal

Leave A Reply

Your Email Id will not be published!