Arvind Kejriwal : జైన్ ను క‌లుసుకున్న కేజ్రీవాల్

ఏడాది త‌ర్వాత ఇద్దరి ములాఖ‌త్

Arvind Kejriwal : మ‌నీ లాండ‌రింగ్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన ఢిల్లీ మాజీ ఆప్ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ ను ఆదివారం క‌లుసుకున్నారు ఆప్ క‌న్వీన‌ర్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). జైన్ ను అరెస్ట్ చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. స‌త్యేంద‌ర్ జైన్ జైలుకు వెళ్లి స‌రిగ్గా ఏడాది అయ్యింది. ఇటీవ‌లే స‌త్యేంద‌ర్ జైన్ స్పృహ త‌ప్పి ప‌డిపోయారు. ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ. ఇందుకు సంబంధించి అనారోగ్యానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు స‌మ‌ర్పించారు.

దీంతో కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. తీవ్ర‌మైన అనారోగ్యం కార‌ణంగా ముంద‌స్తు బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో బ‌య‌ట‌కు జైన్ ను ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ను ఆలింగ‌నం చేసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇదిలా ఉండ‌గా స‌త్యేంద‌ర్ జైన్ త‌ల‌కు గాయం కార‌ణంగా ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన‌ట్లు తేలింది. ఈ సంద‌ర్బంగా సీఎం ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. కేంద్ర స‌ర్కార్ కావాల‌ని క‌క్ష క‌ట్టింది. ఎలాంటి ఆధారాలు ల‌భ్యం కాలేదు. కానీ క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో లిక్క‌ర్ స్కాంలో మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ఆయ‌న కూడా తీహార్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా అటు జైన్ , ఇటు సిసోడియా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు రెండు క‌ళ్లు లాగా ప‌ని చేస్తూ వ‌చ్చారు. ఈ ఇద్ద‌రిని అరెస్ట్ చేయ‌డంతో కేజ్రీవాల్ చాలా ఇబ్బంది ప‌డ్డారు. కానీ కోర్టు ప‌రంగా తేల్చుకుంటామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : Sharad Pawar

Leave A Reply

Your Email Id will not be published!