Sharad Pawar : నేను వెళ్ల‌నందుకు సంతోషంగా ఉంది

ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ కామెంట్స్

Sharad Pawar : నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి తాను వెళ్ల‌నందుకు ఆనందంగా ఉంద‌న్నారు ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్(Sharad Pawar). ఆదివారం ప్ర‌ధాన‌మంత్రి ప్రెసిడెంట్ ను కాద‌ని ప్రారంభించారంటూ ఆరోపించారు. పాత పార్ల‌మెంట్ తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌న్నారు. తాను సంతోషంగా లేన‌ని పేర్కొన్నారు ఎన్సీపీ చీఫ్‌. ఇవాళ మొత్తం కార్య‌క్ర‌మాన్ని వీక్షించాను వ‌ర్చువ‌ల్ గా. అక్క‌డ ఏం జ‌రిగిందో నేను చూసి ఆందోళ‌న చెందుతున్నాన‌ని వాపోయారు.

మ‌నం దేశానికి , 145 కోట్ల ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌ని అనుకుంటున్నామో స్ప‌ష్టంగా తెలియ చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ఉంద‌న్నారు శ‌ర‌ద్ పవార్. మ‌నం దేశాన్ని వెన‌క్కి తీసుకు వెళుతున్నామా లేక ప‌రిమిత వ్య‌క్తుల కోసం ప‌ని చేస్తున్నామా అన్న అనుమానం త‌న‌కు క‌లిగింద‌ని అన్నారు .

ఏది జ‌రిగినా అది మాజీ దివంగ‌త ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ స‌మాజ భావ‌న‌కు పూర్తిగా విరుద్దంగా ఉంద‌న్నారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధార‌గా స‌మాజాన్ని నిర్మించాల‌నే భావ‌న‌తో ఉన్న పండిట్ నెహ్రూకు ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీకి మ‌ధ్య చాలా తేడాలు ఉన్నాయ‌న్నారు శ‌ర‌ద్ పవార్. రాజ్య‌స‌భ చీఫ్ జ‌గ‌దీప్ ధ‌న్ ఖర్ లేరు. ఇక దేశానికి ప్ర‌థ‌మ పౌరురాలు ద్రౌప‌ది ముర్ము ఆచూకీ లేదు. ఒక్క స్పీక‌ర్ ఓం బిర్లా మాత్రమే క‌నిపించార‌ని మండిప‌డ్డారు.

Also Read : RS Praveen Kumar

Leave A Reply

Your Email Id will not be published!