RS Praveen Kumar : తెలంగాణ‌లో బుల్ డోజ‌ర్ల పాల‌న‌

నిప్పులు చెరిగిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ

RS Praveen Kumar : రాష్ట్రంలో పాల‌న దారుణంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). బాధ్య‌తా రాహిత్యంతో సీఎం ఉండ‌డం వ‌ల్ల‌నే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని మండిప‌డ్డారు. లిక్క‌ర్ స్కాం, పేప‌ర్ లీక్ స్కాం, భూ స్కాం..ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పాల‌నంతా స్కాంల‌కు ఆలంబ‌న‌గా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో చోటు చేసుకున్న పేప‌ర్ లీకేజీల వ్య‌వ‌హారం ఇంకా తేలలేద‌ని కానీ నిస్సిగ్గుగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామంటూ తేదీలు ప్ర‌క‌టించ‌డం దారుణమ‌న్నారు. లీకుకు సంబంధించి అరెస్ట్ లు కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని కానీ ఇంకో ప‌క్క ప‌రీక్ష‌లు ఎలా చేప‌డ‌తారంటూ నిప్పులు చెరిగారు.

పేద‌ల‌ను ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం బుల్ డోజ‌ర్ల‌తో కూల్చి వేస్తోంద‌ని ఆరోపించారు. ఆయ‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా రేకుర్తిలో 20 ఏళ్ల కింద‌ట నిర్మించిన ఇళ్ల‌ను కూల్చి వేసిన ఘ‌ట‌న‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఈ రాష్ట్రంలో రోజు రోజుకు అరాచ‌క‌త్వం పేట్రేగి పోతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్ప‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పేద‌లు, సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త లేద‌ని మార్పు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Akunuri Murali

Leave A Reply

Your Email Id will not be published!