Sahasra Kalasabhisekham : ఘనంగా సహస్ర కలశాభిషేకం
భోగ శ్రీనివాస మూర్తికి ప్రత్యేకం
Sahasra Kalasabhisekham : తిరుమల భక్తులతో పోటెత్తింది. సెలవులు కావడంతో ఎక్కడ చూసినా భక్తులే దర్శనం ఇస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ 60 వేలకు పైగా స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇక శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవ రాణి సామవై ప్రతిష్టించిన రోజును పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్ర కలశాభిషేకం(Sahasra Kalasabhisekham) ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని గరుడ ఆళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వమి వారు , శ్రీ భోగ శ్రీనివాస మూర్తి, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేసేలా చేశారు. శ్రీవారి మూల మూర్తికి ముందు గరడాళ్వార్ సన్నిధిలో కౌతుక మూర్తి అయిన శ్రీ మనవాళ పెరు మాళ్ శ్రీ భోగ శ్రీనివాస మూర్తిని ఆయనకు అభిముఖంగా శ్రీ విష్వక్సేసుల వారిని ఉంచారు.
శ్రీవారి మూల మూర్తిని శ్రీ భోగ శ్రీనివాస మూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. శ్రీ భోగ మూర్తికి నిర్వహించే అభిషేకాది క్రతువులు మూల మూర్తికి నిర్వహించినట్లు అవుతుంది. అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా అర్చక స్వాములు స్వామి వారికి ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం ఘనంగా చేపట్టారు.
Also Read : PM Modi
