Wrestlers Protest : కాఖీల దాష్టీకం రెజ్ల‌ర్ల ఆందోళ‌న ఉద్రిక్తం

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వం వేళ

Wrestlers Protest : తాము లైంగికంగా వేధింపుల‌కు గుర‌వుతున్నామ‌ని వెంట‌నే భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ ను తొల‌గించాల‌ని కోరుతూ ఏప్రిల్ 23 నుంచి ఆందోళ‌న చేప‌ట్టారు. మే 28న ఆదివారం నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers) మ‌హిళా పంచాయ‌త్ చేప‌ట్టేందుకు నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ భ‌వ‌నం కు రెండు కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ దూరంలో రెజ్ల‌ర్లు శాంతియుతంగా మార్చ్ చేప‌ట్టేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

వారికి మ‌ద్ద‌తుగా పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. వినేష్ ఫోగ‌ట్ , సాక్షి మాలిక్ , బ‌జ‌రంగ్ పునియా తో స‌హా అగ్ర శ్రేణి రెజ్ల‌ర్ల‌ను(Wrestlers) ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. ఖాకీలు అనుస‌రించిన తీరు ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమైంది. ఇప్ప‌టికే సంయుక్త కిసాన్ మోర్చా బేష‌ర‌తుగా ఆడ‌బిడ్డ‌ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై నార్కో టెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు సింగ్.

బ‌జ‌రంగ్ , వినేష్ ఫోగ‌ట్, సాక్షి మాలిక్ నార్కో టెస్టు చేసుకుంటే తాను కూడా రెడీ అన్నారు. దీనిపై నిప్పులు చెరిగింది వినేష్ ఫోగ‌ట్ . తాము రెడీ అని ఈ టెస్టుల‌ను అన్ని ఛాన‌ళ్లు ప్ర‌త్య‌క్షంగా ప్ర‌సారం చేయాల‌ని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండ‌గా ఇవాళ రెజ్ల‌ర్ల‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.

Also Read : Sahasra Kalasabhisekham

Leave A Reply

Your Email Id will not be published!