Yashasvi Jaiswal : స్టాండ్ బై ఆట‌గాడిగా జైస్వాల్ – బీసీసీఐ

రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో పిలుపు

Yashasvi Jaiswal : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో దుమ్ము రేపిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్(Yashasvi Jaiswal) కు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింది. భార‌త క్రికెట‌ర్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. వ‌చ్చే జూన్ 7 నుంచి యుకే వేదిక‌గా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఈ ఫైన‌ల్ లో భార‌త్ , ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఇప్ప‌టికే హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ తో పాటు కొంద‌రు ఆట‌గాళ్లు లండ‌న్ కు చేరుకున్నారు. మ‌రో వైపు ఐపీఎల్ ముగియ‌డంతో ఎంపికైన క్రికెట‌ర్లు బ‌య‌లు దేర‌నున్నారు. కాగా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కు సంబంధించి ఆడే భార‌త క్రికెట్ జ‌ట్టును ఎంపిక చేసింది బీసీసీఐ.

తాజాగా మ‌రో కీల‌క మార్పు చేసింది. ముందుగా ప్ర‌క‌టించిన జ‌ట్టులో స్టాండ్ బై ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది. వారిలో రుతురాజ్ గైక్వాడ్ ఒక‌రు. గాయం కార‌ణంగా త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో ఐపీఎల్ సీజ‌న్ లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన యువ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది.

ఈ మేర‌కు అధికారిక‌గా వెల్ల‌డించింది. ఒక‌ప్పుడు తండ్రితో పాటు పానీ పూరీ అమ్మిన ఈ కుర్రాడు ఇవాళ కోట్లు ప‌లికే క్రికెట‌ర్ గా మారాడు. ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. మొత్తంగా బంప‌ర్ ఛాన్స్ ద‌క్క‌డం విశేషం.

Also Read : Wrestlers Protest

Leave A Reply

Your Email Id will not be published!