Bhatti Vikramarka : బీఆర్ఎస్ ప‌త‌నం ఖాయం – భ‌ట్టి

కొల్లాపూర్ స‌భ‌లో సీఎల్పీ కామెంట్స్

Bhatti Vikramarka : సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేప‌ట్టిన పీపుల్స్ యాత్ర ప్ర‌స్తుతం కొల్లాపూర్ లో ముగిసింది. జూన్ 1 , గురువారం అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశిస్తుంది. ఈ సంద‌ర్బంగా ఇవాళ లింగాల ప‌రిధిలోని అంబ‌ట్ ప‌ల్లి, అవుస‌లిప‌ల్లి, న‌ర్సాయ‌ప‌ల్లి క్రాస్ రోడ్ మీదుగా కొన‌సాగుతుంది. అంత‌కు ముందు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) యాత్ర కొల్లాపూర్ కు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాల‌న సాగిస్తున్నాడ‌ని, ఇక ప్రజ‌లు ఎంతో కాలం వేచి చూసే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నిట్ట నిలువునా ద‌య‌నీయంగా మార్చాడంటూ మండిప‌డ్డారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని వాటిలొ ఒక్క పోస్ట్ అయినా ఎందుకు ఇప్ప‌టి వ‌ర‌కు భ‌ర్తి చేయ‌లేక పోయారంటూ ప్ర‌శ్నించారు.

నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణ‌లో క‌మీష‌న్లు, కాంట్రాక్ట‌ర్లు, రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్ల రాజ్యంగా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. దొంగ‌లు, దొర‌ల‌కు, బ‌డా బాబుల‌కు మేలు చేకూర్చేలా ధ‌ర‌ణిని తీసుకు వ‌చ్చార‌ని తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : Nara Lokesh

Leave A Reply

Your Email Id will not be published!