Tirumala Crowds : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్త‌జ‌నం

ఒక్క రోజే 80,284 మంది ద‌ర్శ‌నం

Tirumala Crowds : క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువై ఉన్న తిరుమ‌ల‌కు భారీ ఎత్తున భ‌క్తులు చేరుకుంటున్నారు. వేస‌వి సెల‌వులు కావ‌డంతో స్వామి, అమ్మ వార్ల‌ను క‌నులారా చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. ఎక్క‌డ చూసినా భ‌క్తుల‌తో నిండి పోయింది పుణ్య క్షేత్రం. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పెద్ద ఎత్తున వ‌స్తున్న(Tirumala Crowds) భ‌క్తుల‌కు వ‌స‌తి స‌దుపాయాలు అంద‌జేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్ప‌టికే గ‌దులు నిండి పోయాయి. దీంతో భ‌క్తుల‌కు అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌రుడి ఆల‌యం ముందు భారీగా కొలువు తీరారు భ‌క్తులు.

ఇక ద‌ర్శ‌నం కోసం కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల కోసం స్వామి వారి ప్ర‌సాదాన్ని అంద‌జేస్తున్నారు. తిరుమ‌ల‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఇప్ప‌టికే టీటీడీ జ‌ల ప్రసాదాల‌ను ఏర్పాటు చేసింది. క‌ళ్యాణ‌క‌ట్ట‌లు సైతం నిండి పోయాయి. అన్న‌దాన స‌త్రాల‌కు సైతం భ‌క్తులు పోటెత్తారు. దీంతో క్యూ లైన్లు పెరిగి పోయాయి. ఇక మే 31 బుధ‌వారం ఒక్క రోజు రికార్డు స్థాయిలో భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. ఏకంగా 80,284 మంది ద‌ర్శించు కోవ‌డం విశేషం.

ఇక స్వామి వారి హుండీ ఆదాయం 3.71 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారికంగా వెల్ల‌డించింది. ఇక ద‌ర్శ‌నం కోసం ఇంకా 14 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నార‌ని పేర్కొంది. మ‌రో వైపు టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం నిలిచి ఉన్న భ‌క్తుల‌కు సుమారు 18 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ తెలిపింది.

Also Read : Peddasesha Vahanam

 

Leave A Reply

Your Email Id will not be published!