Amit Shah : హింస‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు – షా

కేంద్ర హోం శాఖ మంత్రి హెచ్చ‌రిక‌

Amit Shah : మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న హింస‌, అల్ల‌ర్ల‌పై ఫోక‌స్ పెట్టారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌రిస్థితిని స‌మీక్షించారు. మోరేలో హిల్ ట్రైబ‌ల్ కౌన్సిల్ , కుకీ స్టూడెంట్స్ ఆర్గ‌నైజేష‌న్ , కుకీ చీఫ్స్ అసోసియేష‌న్ , త‌మిళ్ సంగం , గూర్ఖా స‌మాజ్ ,మ‌ణిపురి ముస్లిం కౌన్సిల్ ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు అమిత్ చంద్ర షా.

కొన్ని ప్రాంతాల్లో కాల్పులు, దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌నే ప్ర‌చారంతో ప‌రిస్థ‌తి ఇంకా ఉద్రిక్తంగానే కొన‌సాగుతోంది. వీలైనంత త్వ‌రగా సాధార‌ణ స్థితికి తీసుకు రావ‌డానికి క‌ఠిన‌మైన‌, స‌త్వ‌ర చర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రి ఆదేశించారు. ఎవ‌రు అసాంఘిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా లేదా చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

ఎవ‌రినీ వ‌ద‌ల వ‌ద్ద‌ని వీలైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు అమిత్ చంద్ర షా. ఇదిలా ఉండ‌గా కాంగ్ పోక్సేల‌లో పౌర స‌మాజ సంస్థ‌లు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. రాష్ట్రంలో సాధార‌ణ స్థితిని పున‌రుద్ద‌రించేందుకు ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు పౌర స‌మాజ సంఘాలు బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఇచ్చాయ‌ని తెలిపారు.

కాగా ఎవ‌రైనా అన‌ధికారికంగా , అక్ర‌మంగా ఆయుధాలు , మందుగుండు సామాగ్రిని క‌లిగి ఉన్నార‌ని తేలితే వారిపై చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం బీరేన్ సింగ్ హెచ్చ‌రించారు.

Also Read : Rahul Gandhi Crazy

 

Leave A Reply

Your Email Id will not be published!