Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు రోజుల పర్యటనలో ఉన్న ఆయన యూఎస్ లోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, మేధావులు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని తప్పు పట్టారు.
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం ఆశించిన మేర పొరుగు దేశాల మధ్య సత్ సంబంధాలను కొనసాగించ లేక పోతోందన్నారు. ప్రధానంగా భారత్, చైనా దేశాల మధ్య పోటీ పెరిగిందని, పలుసార్లు ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇది దేశానికి 143 కోట్ల భారతీయులకు ఎంత మాత్రం మంచిది కాదన్నారు. భారత దేశం తన స్వంత ప్రయోజనాల కోసం వెతకాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత కఠినంగా మారాయన్నారు. కొనసాగించడం అంత తేలికైన విషయం కాదని పేర్కొన్నారు.
చైనా భారత్ ను ఎదుర్కోవడం సాధ్యం కాదన్నారు. దేశానికి సంబంధించిన కొంత భూ భాగాన్ని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రచారంపై ఫోకస్ పెట్టారని కానీ తీవ్రమైన , అత్యంత జఠిలంగా మారిన చైనా సమస్యను మాత్రం పరిష్కరించిన పాపాన పోలేదన్నారు రాహుల్ గాంధీ.
Also Read : K Annamalai
