YS Jagan : బాబు హంగామా మోసానికి చిరునామా

నిప్పులు చెరిగిన ఏపీ సీఎం జ‌గ‌జ్ రెడ్డి

YS Jagan : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడిపై మండిప‌డ్డారు. ఆయ‌న బ‌తుకంతా మోసం త‌ప్ప ఇంకేమీ లేద‌న్నారు. అధికారం కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉంటాడ‌ని ఎద్దేవా చేశారు. తాను చెప్ప‌న‌ని కానీ చేసి చూపిస్తాన‌ని అన్నారు. ఇవాళ దేశంలోనే ఏపీ ఆద‌ర్శంగా మారింద‌న్నారు.

త‌న ప్ర‌యారిటీ విద్య‌, ఆరోగ్యం, ఉపాధి అని దానిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాన‌ని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు అంత సీన్ లేద‌న్నారు. ప్ర‌జ‌లు ఎప్పుడో డిసైడ్ అయ్యార‌ని తిరిగి త‌మ‌కే ప‌వ‌ర్ క‌ట్ట‌బెట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. గురువారం క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌లో వైఎస్సార్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS jagan). ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. వ‌రుస‌గా ఐదోసారి రైతు భ‌రోసా పీఎం కిసాన్ ప‌థ‌కం కింద నిధులు విడుద‌ల చేశామ‌న్నారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

మొత్తం 3 వేల 900 కోట్ల‌కు పైగా నిధులు జ‌మ చేసిన‌ట్లు చెప్పారు. ప్రతీ రైతుకు ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 54 వేలు రైతు భ‌రోసా కింద ఇచ్చామ‌ని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్ర‌తి హామీని నెర‌వేర్చ‌డం జ‌రిగింద‌న్నారు. అధికారం కోసం చంద్ర‌బాబు ఎవ‌రినైనా పొడిచేందుకు సిద్దంగా ఉంటాడ‌ని హెచ్చ‌రించారు. బాబుకు ఒరిజినాల్టీ లేదు..ప‌ర్సనాల్టీ అంత క‌న్నా లేద‌న్నారు.

Also Read : Rahul Gandhi

 

Leave A Reply

Your Email Id will not be published!