CM Siddaramaiah : హామీల అమలుకు సీఎం పచ్చజెండా
తేదీలను ప్రకటించిన సిద్దరామయ్య
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలను అమలు చేస్తామని వెల్లడించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారెంటీ పేరుతో ప్రకటించిన ఐదు హామీలను ఇందుకు సంబంధించి అమలు తేదీలను ఈ సందర్బంగా వెల్లడించారు.
జూలై 1 నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేస్తామన్నారు సిద్దరామయ్య. అయితే పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని సీఎం కోరారు. ఇక జూన్ 11 నుండి మహిళలకు ముందుగా ప్రకటించిన విధంగా ఏసీ బస్సులు మినహా పబ్లిక్ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇకపై 50 శాతం బస్సు సీట్లు పురుషులకు కేటాయించనున్నట్లు సీఎం చెప్పారు.
బీపీఎల్ కార్డు కుటుంబాలకు జూలై 1 నుండి 10 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు సిద్దరామయ్య. అంతే కాకుండా ఆగస్టు 15 నుండి మహిళల కుటుంబ పెద్దలకు రూ. 2,000 నెల వారీ సాయం చేస్తామని చెప్పారు. నిరుద్యోగ గ్రాడ్యూయేట్లకు రూ . 3,000 వేలు , రిజిస్ట్రేషన్ తేదీ నుండి 24 నెలల పాటు డిప్లొమా హొల్డర్లకు రూ. 1,500 భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే గ్రాడ్యుయేట్లు , డిప్లొమా హోల్డర్లు గనుక జాబ్స్ పొందినట్లయితే సాయాన్ని ఆపి వేస్తామని స్పష్టం చేశారు సిద్దరామయ్య.
Also Read : YS Sharmila KCR : దొర పాలనలో రైతన్నలు దగా
