Rahul Gandhi : ప్రపంచం మారుతూ ఉంటుంది. టెక్నాలజీలో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి సహజం. దీనిని మనం సానుకూలంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అమెరికాలో ఉన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు ఇచ్చారు రాహుల్ గాంధీ. ప్రతి కొత్త ఆవిష్కరణను తరచుగా విమర్శనాత్మకంగా చూడటం అలవాటేనని స్పష్టం చేశారు.
కాగా ప్రస్తుతం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల చాలా ఉద్యోగాలకు ఎసరు కలుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానం చెప్పారు. గతంలో సెర్చింగ్ పరంగా చూస్తే యాహూ ఉండేది. కానీ దానిని దాటేసి గూగుల్ వచ్చింది. ప్రస్తుతం ఏఐ రాజ్యం ఏలుతోంది టెక్నికల్ పరంగా. అలాగని టెక్నాలజీలో నిత్యం మార్పులు చోటు చేసుకోవడం సహజమేనని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
దీనిని సమాజానికి లేదా మొత్తం మానమ సమూహానికి వ్యతిరేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇందులో బాధ పడటానికి ఏముందని ప్రశ్నించారు. కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాల్సిందేనని ఆ వాస్తవం గుర్తిస్తే మంచిదన్నారు రాహుల్ గాంధీ.
Also Read : AAP Slams : రైల్వే మంత్రికి బాధ్యత లేదా – ఆప్
