Rahul Gandhi : దేశానికి మానవీయ స్ప‌ర్శ అవ‌స‌రం

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : ప్ర‌జాస్వామ్య యుతంగా ఏర్ప‌డిన భార‌త్ ప్ర‌పంచానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఆరు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న అమెరికాలో ఉన్నారు. సోమ‌వారం యుఎస్ లోని న్యూయార్క్ లోని డయాస్పోరా లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

భిన్న మ‌తాలు, కులాలు, ప్రాంతాలు, వ‌ర్గాల‌తో కూడిన భార‌త స‌మాజం గ‌త కొన్నేళ్లుగా స‌మ‌న్వ‌యంతో ముందుకు వెళుతోంద‌ని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇదే క్ర‌మంలో కులం , మ‌తం , విద్వేషం పేరుతో కొన‌సాగుతూ వ‌స్తున్న విధ్వంస‌క‌ర విధానాలు లేక పోలేద‌ని పేర్కొన్నారు. ఏది ఏమైనా గాంధీ చూపిన మార్గం , నెహ్రూ దూర దృష్టి, ఇందిర ఉక్కు సంక‌ల్పం, రాజీవ్ గాంధీ ముందు చూపు ఈ దేశాన్ని ఉన్న‌తంగా నిలిచేలా చేసింద‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్‌.

తాను చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఈ దేశంలో మ‌నుషులంతా ఒక్క‌టేన‌న్న స‌మైక్య భావ‌న‌ను తీసుకు వ‌చ్చేలా చేసింద‌న్నారు. ఈ ఒక్క కార్య‌క్ర‌మంతో తాను ఎన్నో నేర్చుకున్నాన‌ని, వేలాది మందిని క‌లుసుకున్నాన‌ని చెప్పారు రాహుల్ గాంధీ. మాన‌వ స‌మూహానికి మానవీయ స్ప‌ర్శ అన్న‌ది లేక పోతే ప్ర‌పంచం మ‌న‌జాల‌మ‌ని స్ప‌ష్టం చేశారు. మాన‌వ‌త్వమే అంతిమం కావాల‌ని పిలుపునిచ్చారు.

హింసోన్మాదం, అరాచ‌కీయం, ఉగ్ర‌వాదం, విద్వేష పూరితం ఇవ‌న్నీ స‌భ్య స‌మాజాన్ని, దేశాన్ని అస్థిర ప‌రిచేలా చేస్తాయ‌ని చెప్పారు రాహుల్ గాంధీ. దీనిని తాము పూర్తిగా నిర్మూలించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Also Read : Bridge Collapse : బీహార్ లో కుప్ప కూలిన భారీ వంతెన

 

Leave A Reply

Your Email Id will not be published!