CM YS Jagan : చెత్త ర‌హిత రాష్ట్రంగా ఏపీ – సీఎం

ఈ ఆటోల‌ను ప్రారంభించిన జ‌గన్ రెడ్డి

CM YS Jagan : సీఎం సందింటి నేతృత్వం లోని వైసీపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌ధానంగా ప‌ర్యావ‌ర‌ణం కాపాడు కోవాల‌ని , చెట్ల‌ను నాటాల‌ని, చెత్త ర‌హిత రాష్ట్రంగా మార్చేందుకు ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సీఎం జ‌గ‌న్ రెడ్డి(CM Jagan Reddy) ముందు చూపుతో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలుష్య ర‌హిత ఈ – ఆటోల‌ను ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించారు. ఈ మేర‌కు గురువారం ఈ ఆటోల‌ను జెండా ఊపి ప్రారంభించారు సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఏపీలోని అన్ని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు , గ్రామాలు పూర్తిగా చెత్త ర‌హితంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ఈ ఈ-ఆటోలు చెత్త‌ను సేక‌రించేందుకు ఉప‌యోగ ప‌డ‌తాయి. సీఎం స్వ‌యంగా ఆటోను ప్రారంభించ‌డం విశేషం. మొన్న‌టికి మొన్న తానే ఆటోను న‌డిపి అంద‌రినీ విస్తు పోయేలా చేశారు ఏపీ సీఎం. తాను ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను ఒక్కటొక్క‌టిగా అమ‌లు చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు హామీల‌లో 95 శాతం పూర్తి చేశాన‌ని చెప్పారు సీఎం.

రాష్ట్రం మొత్తాన్ని ప‌రిశుభ్రంగా మార్చాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు జ‌గ‌న్ మోహన్ రెడ్డి. తాడేప‌ల్లి గూడెంలోని త‌న క్యాంపు కార్యాల‌యం నుంచి ప్రారంభించిన అనంత‌రం సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు కూడా ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల స‌మాజానికి , రాష్ట్రానికి, దేశానికి ఎంతో మేలు చేసిన వార‌వుతార‌ని అన్నారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

Also Read : DK Shiva Kumar : 11 నుంచి మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం

 

Leave A Reply

Your Email Id will not be published!