Google Shock : గూగుల్ నిర్ణయం ఉద్యోగులు ఆగ్రహం
మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే
Google Shock : టెక్ దిగ్గజ కంపెనీ రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. ఓపెన్ ఏఐ దెబ్బకు గూగుల్ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఏఐకి ప్రత్యామ్నాయంగా గూగుల్ కూడా కొత్త టెక్నాలజీ టూల్ ను తీసుకు వచ్చింది. ఇది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై పడింది. దీంతో ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, టెలికాం, లాజిస్టిక్, నిర్మాణ, హాస్పిటాలిటీ, తదితర రంగాలలో వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రత్యేకించి ట్విట్టర్, టెస్లా, గూగుల్, ఫేస్ బుక్, లింక్డ్ ఇన్ , అమెజాన్ కంపెనీలు తగదునమ్మా అంటు పొమ్మనకుండా పొగ పెట్టాయి.
గూగుల్(Google) మాతృ సంస్థ ఆల్ఫా బెట్ కంపెనీలో భారీ ఎత్తున గూగుల్ ఉద్యోగులను తొలగించింది. మరో వైపు కరోనా ఎఫెక్ట్ ప్రభావం కారణంగా ఇంటి వద్ద నుంచే పని చేసేందుకు అన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించాయి. కాగా మైక్రో సాఫ్ట్ , ఫేస్ బుక్ – మెటా , ట్విట్టర్ సంస్థలు అందుకు ఒప్పుకోలేదు. ఆఫీసులకు రావాల్సిందేనంటూ ఆదేశించాయి. కానీ జాబ్స్ లేక పోయినా పర్వాలేదు. కానీ ఆఫీసులకు వచ్చే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు జాబర్స్.
తాజాగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమ సంస్థలోని ఉద్యోగులకు మెయిల్ పంపింది. అదేమిటంటే మూడు రోజుల పాటు ఆఫీసులకు రావాలని. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధిత ఉద్యోగులు. ఇప్పటికే కీలకమైన వ్యక్తులు ఇంటి బాట పట్టారు. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక వెళ్లి పోతున్నారు. ఇటీవలే సిఇఓ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. మారక పోతే వేటు తప్పదని.
Also Read : Revanth Reddy : అధికారంలోకి వస్తం జైలుకు పంపుతం
