Priyanka Gandhi : న‌ర్మ‌దా పూజలో పాల్గొన్న ప్రియాంక

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌పై ఫోక‌స్

Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ మ‌ధ్య ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. సోమవారం ఆమె జ‌బ‌ల్ పూర్ లోని గ్వారి ఘాట్ లో న‌ర్మ‌దా పూజ‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే సంస్థ‌లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంద‌ని పేర్కొన్నాయి.

ఈ ఏడాది కాంగ్రెస్ పార్టీకి ఒకింత ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. గుజ‌రాత్ లో భారీ ఓట‌మి మూట‌గ‌ట్టుకున్నా ఊహించ‌ని రీతిలో పుంజుకుంది క‌ర్ణాట‌క‌లో. అక్క‌డ కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టింది. 224 సీట్ల‌కు గాను 135 సీట్లు కైవ‌సం చేసుకుంది. దీని వెనుక త‌ల్లి సోనియా , కూతురు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), కొడుకు రాహుల్ గాంధీల ప్ర‌భావం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అంత‌కు ముందు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి, గెలుపొంద‌డానికి దోహ‌ద ప‌డింది. ఇదే స‌మ‌యంలో ప్రియాంక గాంధీ ఎక్కువ‌గా క‌ర్ణాట‌క‌లో ఫోక‌స్ పెట్ట‌డం కూడా ప్ర‌ధాన బ‌లంగా మారింది. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం బీజేపీ కొలువు తీరిన మ‌ధ్య ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పాగా వేసేందుకు పావులు క‌దుపుతోంది. క‌ర్ణాట‌క ప్లాన్ ను ఇక్క‌డ అమ‌లు చేయాల‌ని చూస్తోంది. అక్క‌డ 5 హామీల‌తో గ్యారెంటీ స్కీంల‌ను ప్ర‌వేశ పెట్టింది.

కాంగ్రెస్ పార్టీ సైతం ప్రియాంక గాంధీని సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా ముందు పెట్టి ప్ర‌చారం చేయించాల‌ని చూస్తోంది. ఇదే స‌మ‌యంలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ను కూడా ఇక్క‌డ పార్టిసిపేట్ చేసేలా చేస్తోంది పార్టీ.

Also Read : Dheeraj V Deshmukh : డీకేకు ధీర‌జ్ దేశ్ ముఖ్ కంగ్రాట్స్

 

Leave A Reply

Your Email Id will not be published!