Arvind Kejriwal : మోదీ అడ్డుకున్నా విద్యాభివృద్ది ఆగదు
స్పష్టం చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో నూతనంగా ఆధునిక వసతి సౌకర్యాలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. గత కొంత కాలం నుంచీ కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తోందని , నిధులు విషయంలో, అధికారాల విషయంలో కానీ తాము ఏనాడూ వాటిని పట్టించు కోలేదన్నారు సీఎం.
తమ మొదటి ప్రాధాన్యత విద్య, వైద్యం, ఉపాధి అని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). తమను నియంత్రించేందుకు కొత్తగా ఆర్డినెన్స్ తీసుకు రావాలని చూస్తోందని దీనిపై తాము యుద్దం ప్రకటించామని స్పష్టం చేశారు. మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ సర్కార్ కు మతం, కులం, ప్రాంతం, విద్వేషాలు తప్ప ఇంకేదీ చేతకాదన్నారు.
ఈదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తాము విద్యా రంగాన్ని అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు అరవింద్ కేజ్రీవాల్. తమ బడ్జెట్ లో అత్యధిక శాతం విద్య కే కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్రం వ్యాపారవేత్తలకు లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. కానీ తాము ఎవరైనా సరే, ఎంతటి స్థానంలో ఉన్న వారైనా సరే ప్రభుత్వ బడిలో చదువు కోవాల్సిందేనని అన్నారు. సమ న్యాయం , సమ ప్రాధాన్యత తమ లక్ష్యమన్నారు. ఈ దేశానికి విద్య ఒక్కటే వెలుగును ఇస్తుందన్నారు సీఎం.
Also Read : While We Watched : 21న న్యూయార్క్ లో ‘రవీష్’ ఫిల్మ్
