Bhatti Vikramarka : జనం కోసం బీఆర్ఎస్ పై పోరాటం – భట్టి
నిప్పులు చెరిగిన సీఎల్పీ నేత
Bhatti Vikramarka : సకల జనుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు. ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఉమ్మడి పాలమూరు జిల్లా మీదుగా ప్రస్తుతం నల్లగొండకు చేరుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు భట్టి విక్రమార్కకు.
ఆదివాసీలు, గిరిజనులు, సంబండ వర్ణాలు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) యాత్రకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే పరిస్థితుల్లో సీఎం లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్, శాండ్ మాఫియాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఇంటింటా సౌభాగ్యం వస్తుందని అన్నారు భట్టి విక్రమార్క.
ఇవాళ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వచ్చేది తమ ప్రభుత్వమేనని, కొలువు తీరిన వెంటనే మొదటి సంతకం ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు సీఎల్పీ నేత. కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు కొల్లగొట్టే వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : Bhagavanth Kesari Record : భగవంత్ కేసరి టీజర్ రికార్డ్
