CM Siddaramaiah : అన్న‌భాగ్య‌కు కేంద్రం అడ్డుపుల్ల‌ – సీఎం

నిప్పులు చెరిగిన సిద్ద‌రామ‌య్య

CM Siddaramaiah : పేద‌ల‌కు ఉచితంగా రేష‌న్ ఇవ్వాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇదిలా ఉండ‌గా కేంద్ర ఆహార సంస్థ కావాల‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. బియ్యం అందుబాటులో పెట్టుకుని ఇవ్వ‌క పోతే పేద‌ల ఉసురు త‌గులుతుంద‌న్నారు. కేంద్ర స‌ర్కార్ బియ్యాన్ని ఉచితంగా ఇవ్వ‌ద‌ని పేర్కొన్నారు సీఎం. దానికి తామే చెల్లించాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సిద్ద‌రామ‌య్య‌.

ఇత‌రుల‌కు ఇచ్చిన‌ట్లే త‌మ‌కు కూడా ఇవ్వాల్సి ఉంటుంద‌న్నారు. కానీ కావాల‌ని కేంద్రం క‌క్ష సాధింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు సీఎం. తాజాగా త‌మ రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. కేంద్రం అడ్డుకున్నా తాము పేద‌ల‌కు ఉచితంగా రేష‌న్ ఇచ్చి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah). మ‌ళ్లీ అప్పీలు చేస్తామ‌ని తెలిపారు.

ఎఫ్‌సీఐ తో తాము ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్పారు సిద్ద‌రామ‌య్య‌. జూలై 1 నుంచి ప్ర‌తి ఒక్క‌రికీ 10 కిలోల ఉచిత బియ్యం ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన అన్న భాగ్య యోజ‌న‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. 7 ల‌క్ష‌ల ట‌న్నుల బియ్యం స్టాక్ ఉంద‌ని ఎఫ్‌సీఐ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ హ‌రీష్ వెల్ల‌డించారు. అయితే అన్న భాగ్య కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయ‌కుండా కేంద్రం అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు సిద్ద‌రామ‌య్య‌. ఇదిలా ఉండ‌గా తెలంగాణ సీఎంతో త‌మ ఆహార శాఖ మంత్రి మాట్లాడుతున్నార‌ని తెలిపారు.

Also Read : Atreyapuram Pootharekulu : పూత రేకుల‌కు భౌగోళిక గుర్తింపు

Leave A Reply

Your Email Id will not be published!