Manipur Files : సిరియాను గుర్తుకు తెస్తున్న మ‌ణిపూర్

ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ ఆర్మీ ఆఫీస‌ర్స్

Manipur Files : మ‌ణిపూర్ లో ప‌రిస్థితి మ‌రింత విషమంగా మారుతోంది. ఎక్క‌డా లా అండ్ ఆర్డ‌ర్ అదుపులోకి రావ‌డం లేదు. ఒక ర‌కంగా ఆ రాష్ట్రాన్ని చూస్తే త‌మ‌కు సిరియా(Syria), లిబియాలో చోటు చేసుకున్న సంక్షోభం గుర్తుకు వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు భార‌త దేశానికి చెందిన మాజీ ఆర్మీ ఆఫీస‌ర్లు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఘ‌ర్ష‌ణ‌ల్లో 96 మంది ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. ఇందులో 25 మంది మేటి సంఘం స‌భ్యులు ఉండ‌గా 63 మంది కుకీ సంఘం స‌భ్యులు ఉన్నారు. వీరు కాకుండా మ‌రో 8 మంది బాధితులకు సంబంధించిన ఆచూకీ ఇంత వ‌ర‌కు తెలియ లేద‌ని పేర్కొన్నారు.

కొంద‌రు గ‌త కొంత కాలంగా ప్రార్థ‌నా స్థ‌లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని వాపోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు 17 ఆల‌యాలు ధ్వంసం కాగా ఏకంగా 221కి పైగా చ‌ర్చీలు ద‌గ్ధం అయ్యాయ‌ని వెల్ల‌డించారు.

ఈ మొత్తం ఘ‌ర్ష‌ణ‌ల్లో 1,988 మేటీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి గృహాలు ధ్వంసం అయ్యాయ‌ని తెలిపారు. ఇక 1,425 కుకీ గృహాలు కోల్పోయార‌ని తెలిపారు. 158కి పైగా మెయిటీ ఆధిప‌త్య గ్రామాలు పూర్తిగా దెబ్బ‌తిన‌డం విశేషం.

Also Read : Pawan Kalyan Slams : వైసీపీ గూండాల‌కు న‌ర‌కం చూపిస్తా

 

Leave A Reply

Your Email Id will not be published!