Anil Kumble YS Jagan : సీఎం జ‌గ‌న్ ను క‌లిసిన కుంబ్లే

రాష్ట్రంలో క్రికెట్ కు చేయూత

Anil Kumble YS Jagan : భార‌త జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ అనిల్ కుంబ్లే శ‌నివారం మ‌ర్యాద పూర్వ‌కంగా ఏపీలోని తాడేప‌ల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన అనిల్ కుంబ్లేను ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం. ఆయ‌న‌కు తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి జ్ఞాపిక‌ను అంద‌జేశారు. ప్ర‌భుత్వం త‌ర‌పున జ‌గ‌న్ రెడ్డి అనిల్ కుంబ్లేకు శాలూవా క‌ప్పి స‌న్మానించారు.

ఈ సంద‌ర్బంగా అనిల్ కుంబ్లే జ‌గ‌న్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌తంలో ఒక‌సారి కుంబ్లే ఏపీ సీఎంను క‌లుసుకున్నారు. రాష్ట్రంలో క్రీడా రంగానికి చేయూత ఇవ్వాల‌ని కోరారు సీఎం. ఇందుకు స‌మ్మ‌తి తెలిపారు అనిల్ కుంబ్లే(Anil Kumble). త‌న వంతు శాయశ‌క్తులా క్రికెట్ తో పాటు ఇత‌ర క్రీడా రంగాల‌కు స‌హాయం చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రో వైపు ఐపీఎల్ త‌ర‌హాలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏపీఎల్ నిర్వహించేందుకు ఆలోచ‌న చేయాల‌ని తాజాగా జ‌రిగిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశంలో సూచించారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. ఇందులో రాష్ట్రంలో ప్ర‌తిభావంతులైన క్రీడాకారులకు చేయూత‌ను ఇచ్చేలా ఉంటుంద‌ని , ఇందుకు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు త‌యారు చేయాల‌ని క్రీడా మంత్రి, చైర్మ‌న్ ను ఆదేశించారు.

ఇందులో భాగంగా ఇవాళ అనిల్ కుంబ్లే జ‌గ‌న్ రెడ్డిని క‌ల‌వడం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : Actor Vijay : ప్ర‌తిభావంతుల‌కు విజ‌య్ చేయూత‌

Leave A Reply

Your Email Id will not be published!