Sanjay Singh : బీజేపీ నేత‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి – ఆప్

ఆప్ ఎంపీ సంచ‌ల‌న కామెంట్స్

Sanjay Singh : ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తీసిన ఆది పురుష్ అట్ట‌ర్ ప్లాప్ గా మిగిలింది. ఈ చిత్రానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆశీస్సులు అందించింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కోట్లాది మంది ప్ర‌జ‌లకు ఆరాధ్య దైవంగా శ్రీ‌రాముడును కొలుస్తార‌ని, మ‌హిళ‌లు నేటికీ అప‌ర సాధ్వీమ‌ణిగా సీత‌ను, అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా ఆంజ‌నేయుడిని ఆరాధిస్తార‌ని అన్నారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ ఎపీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ తో పాటు ఇత‌ర సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా ఆది పురుష్ ను తామే తీశామ‌న్నంత‌గా బిల్డ‌ప్ ఇచ్చార‌ని ఆరోపించారు సంజ‌య్ సింగ్(Sanjay Singh). చివ‌ర‌కు పెద్ద ఎత్తున సినిమా త‌ర‌పున వ‌క‌ల్తా పుచ్చుకున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ , హ‌ర్యానా సీఎం ఖ‌ట్ట‌ర్ , మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫ‌డ్న‌వీస్ , సీఎం పుష్క‌ర్ ధామితో పాటు ఇత‌ర సీఎంలు కూడా ఆది పురుష్ ను భుజానికి ఎత్తుకున్నార‌ని వారే విజ‌యవంతం చేయాల‌ని కోరార‌ని తెలిపారు. ఇదంతా యావ‌త్ దేశం చూసింద‌న్నారు. వీరంద‌రి ఆశీర్వాదాల‌తోనే ఆది పురుష్ రూపుదిద్దుకున్న‌ద‌ని మండిప‌డ్డారు.

కోట్లాది ప్ర‌జ‌లు, భ‌క్తుల మ‌నో భావాల‌కు భంగం క‌లిగించేలా తీసిన ద‌ర్శ‌కుడు , చిత్ర యూనిట్ తో పాటు బీజేపీ శ్రేణులంతా దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఎంపీ సంజ‌య్ సింగ్. ఆయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : KTR Telangana : తెలంగాణ‌లో మా తాండా మా రాజ్యం

Leave A Reply

Your Email Id will not be published!