Muruga Math Seer CM : సీఎంను కలిసిన మురుగ మఠాధిపతి
సిద్దరామయ్యకు జ్ఞాపిక బహూకరణ
Muruga Math Seer CM : కర్ణాటకలోని ధార్వాడ్ శ్రీ మురుగ మఠానికి చెందిన శ్రీ మల్లికార్జున మహా స్వామి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిశారు. సావనూరు దొడ్డ హుంసే కల్మఠం చన్న బసవ మహా స్వామీజీ, హుమ్నా బాద్ హుడగి గ్రామానికి చెందిన చెన్న మల్ల స్వామీజీ, విజయపూర్ శ్రీ సిద్దలింగ స్వామాజీ తో పాటు ఎమ్మెల్యేలు వినయ కులకర్ణి, కొంరెడ్డి ఉన్నారు.
ఈ సందర్బంగా మల్లికార్జున మహా స్వామి సీఎం సిద్దరామయ్యను(Siddaramaiaha) ఆశీర్వదించారు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని , ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. మఠాలు కూడా ఎక్కువే. వివిధ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడంలో మఠాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రత్యేకించి విద్యా పరంగా, నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయి. అంతే కాకుండా భక్తి మార్గాన్ని అనుసరించేలా ఎప్పటికప్పుడు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మఠాలు.
కాగా గతంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లింగాయత్ లను ఆదరించ లేదని ఈసారి కాంగ్రెస్ కు గంప గుత్తగా మద్దతు తెలిపారు. దీంతో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 సీట్లను కైవసం చేసుకుంది.
Also Read : Sanjay Singh : బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి – ఆప్
