Udhayanidhi Stalin : సామాజిక న్యాయం అంతిమ లక్ష్యం
తేజస్వి యాదవ్ తో ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin : మా లక్ష్యం ఒక్కటే. సామాజిక న్యాయం అన్నది ప్రతి ఒక్కరికి చెందాలి. దీని కోసం మేం ఒక్కటిగా పోరాడుతామని స్పష్టం చేశారు తమిళనాడు యువ నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్. మంగళవారం తమిళనాడు లోని తిరువారూర్ లో కలైంజర్ కొట్టం ప్రారంభోత్సవం కోసం బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తరపున తేజస్వి యాదవ్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అంతే కాదు పుస్తకాన్ని కూడా బహూకరించారు.
ప్రాంతాలు వేరు కావచ్చు. భాషలు వేరు కావచ్చు. కానీ మా రక్తం అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. ఇద్దరూ యువ నాయకులు కావడం విశేషం. ఇక్కడ ఉదయనిధి(Udhayanidhi Stalin) నటుడిగా ఉన్నారు. తండ్రి సీఎం. తను యువజనుల, క్రీడా శాఖను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఒడిశాలో చోటు చేసుకున్న రైలు దుర్ఘటనలో స్వయంగా మంత్రులతో కలిసి బాధితులకు భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ కావాలని బీజేపీయేతర ప్రభుత్వాలను, నాయకులను, పార్టీలను టార్గెట్ చేస్తూ వస్తోంది.
ఇటీవల ఈడీ లాలూ ప్రసాద్ ఫ్యామిలీపై దాడులు చేపట్టింది. దీనిని తీవ్రంగా ఖండించారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇదే సమయంలో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై ఈడీ ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. మొత్తంగా యువ నాయకులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.
Also Read : Bhatti Vikramarka : స్కాంలు తప్ప కొలువులు ఏవీ – భట్టి
