PM Modi : మహాత్ముడు మహోన్నత మానవుడు
గాంధీకి నివాళులు అర్పించిన మోదీ
PM Modi : మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ నగరంలో కొలువు తీరిన మహాత్మాడి విగ్రహానికి నమస్కరించారు. ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో చేపట్టిన యోగా అంతర్జాతీయ దినోత్సవానికి నేతృత్వం వహించారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మాట్లాడారు. ఈ ప్రపంచానికి శాంతి అనే ఆయుధాన్ని ఇచ్చిన ఏకైక మానవుడు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. అహింస లేని సమాజాన్ని , దేశాన్ని, ప్రపంచాన్ని చివరి దాకా కోరుకున్నారని చెప్పారు. గాంధీ అడుగు జాడల్లో లక్షలాది మంది నేటికీ నడుస్తున్నారని స్పష్టం చేశారు.
గాంధీ భారత దేశానికి చెందిన వ్యక్తి కావడం తనకు ఆనందంగా ఉందన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, కరుణ , ఆలంబన, ఆసరా , తోడ్పాటు అన్నవి గాంధీ మూల సూత్రాలు అని పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఎందరో మహానుభావులు, దేశాధినేతలు, అన్ని వర్గాలకు చెందిన వారు మహాత్ముడి జీవితాన్ని స్పూర్తి దాయకంగా తీసుకుంటున్నారని ఇదంతా ఆయన చేసిన కృషి అని స్పష్టం చేశారు.
ఏ ప్రపంచమైనా శాంతితోనే మనుగడ సాధించ గలుగుతుందన్నారు. ఇది ఆచరణలో చేసి చూపించిన ఘనత మహాత్మా గాంధీకే దక్కుతుందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
Also Read : Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ