Samson Gaikwad Return : విండీస్ టూర్ కు భార‌త జ‌ట్టు డిక్లేర్

రుతురాజ్ , సంజూ శాంస‌న్ కు ఛాన్స్

Samson Gaikwad Return : ఎట్ట‌కేల‌కు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత కాలంగా ఆట‌కు దూరంగా పెట్టిన రుతురాజ్ గైక్వాడ్ , సంజూ శాంస‌న్ ను ఎంపిక చేసింది. వెస్టిండీస్ లో భారత జ‌ట్టు ప‌ర్య‌టించ‌నుంది. టెస్టు, వ‌న్డే జ‌ట్ల‌ను ఎంపిక చేసింది. ఇటీవ‌లే తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన అజింక్యా ర‌హానేకు ప్ర‌మోష‌న్ ల‌భించింది. ర‌హానేకు వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది బీసీసీఐ. ఒక ర‌కంగా రోహిత్ శ‌ర్మ‌కు బిగ్ షాక్ ఇచ్చిన‌ట్ల‌యింది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ లో అద్బుతంగా ఆడాడు రహానే.

అంత‌కు ముందు ఐపీఎల్ లో కూడా స‌త్తా చాటాడు. దీంతో బీసీసీఐ అత‌డిని ఎంపిక చేయ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. కానీ జ‌ట్టులో ర‌హానే టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. జూలైలో భార‌త్ టూర్ మొద‌ల‌వుతుంది. వ‌న్డే జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. ఇందులో కొత్త‌గా శాంస‌న్ ,గైక్వాడ్(Gaikwad) ల‌కు అవ‌కాశం ఇచ్చింది.

టూర్ లో భాగంగా భార‌త జ‌ట్టు 2 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది. రాబోయే వ‌ర‌ల్డ్ క‌ప్ ను దృష్టిలో పెట్టుకుని ఆ ఇద్ద‌రిని ఎంపిక చేసిన‌ట్లు టాక్.

వ‌న్డే జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ కెప్టెన్ , గిల్ , గైక్వాడ్ , కోహ్లీ , సూర్య కుమార్ యాదవ్ , సంజూ శాంస‌న్ , కిష‌న్ , పాండ్యా , శార్దూల్ ఠాకూర్ , ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్ , చాహ‌ల్ , కుల్దీప్ యాద‌వ్ , జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ ఆడ‌తారు. కాగా వ‌న్డేకు కూడా పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.

Also Read : KA Paul : పాప పుడితే ప్ర‌చారమా – కేఏ పాల్

Leave A Reply

Your Email Id will not be published!