DK Shiva Kumar Bommai : బొమ్మైని క‌లిసిన డీకే

మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశా

DK Shiva Kumar Bommai : అరుదైన స‌న్నివేశానికి వేదికైంది బెంగ‌ళూరు. వాళ్లిద్ద‌రు ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. నిప్పులు చెరిగారు. విమ‌ర్శ‌లు సైతం గుప్పించారు. ఒక‌రు ఒక‌ప్పుడు సీఎం . కానీ ఇప్పుడు మాజీ సీఎం. ఒక‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నేత ఇప్పుడు డిప్యూటీ సీఎం. వాళ్లిద్ద‌రూ ఎవ‌రో కాదు. ఒక‌రు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మాజీ సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై కాగా మ‌రొక‌రు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్.

ఇద్ద‌రూ రాజ‌కీయంగా విభేదించినా మంచి స్నేహితులుగా ఉన్నారు. వారి మ‌ధ్య బంధం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కొన‌సాగుతూ వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా క‌ర్నాట‌క‌లో కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. తాజాగా డీకే శివ‌కుమార్(DK Shiva Kumar) బ్రాండ్ బెంగ‌ళూరును ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందేలా తీసుకు రావాల‌ని సంక‌ల్పించారు. ఆపై పోర్ట‌ల్ ను ప్రారంభించారు. ఎవ‌రైనా స‌రే స‌ల‌హాలు, సూచ‌న‌లు, అభిప్రాయ‌లు తెలియ చేసే అవ‌కాశం ఉంది.

శుక్ర‌వారం స్వ‌యంగా డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ మాజీ సీఎం ఇంటికి వెళ్లారు. ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు బ‌స్వ‌రాజ్ బొమై. ఈ సంద‌ర్భంగా ప‌లు సూచ‌న‌లు ఇచ్చారు బెంగ‌ళూరు న‌గ‌ర అభివృద్ది గురించి. అంత‌కు ముందు డీకేను శాలువాతో స‌త్క‌రించారు బొమ్మై.

Also Read : Lalu Prasad Yadav Satire : న‌వ్వులు పూయించిన లాలూ

Leave A Reply

Your Email Id will not be published!