రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ఆడితే ఇండియాకు ఎదురు లేదు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ ఆకాష్ చోప్రా

హైద‌రాబాద్ : మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్, అన‌లిస్ట్ ఆకాష్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. ఆ ఇద్ద‌రు గ‌నుక క్రీజులో కుదురుకుంటే టీమిండియాకు ఎదురే లేద‌న్నాడు. ఈ ఇద్ద‌రి నుంచి ఉన్న ఏకైక అంచనా పరుగులు సాధించడమేనని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం భారత జట్టుకు కీలకమైన స్వదేశీ సిరీస్‌ల సీజన్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. జియో హాట్ స్టార్‌లోని ‘ఫాలో ది బ్లూస్’ కార్యక్రమంలో జియోస్టార్ నిపుణులు పార్థివ్ పటేల్, ఆకాష్ చోప్రా పాల్గొన్నారు. వారు వన్డే జట్టులో మార్పులు, సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీల నుంచి ఉన్న అంచనాలు, అలాగే 50 ఓవర్ల జట్టులోకి రవీంద్ర జడేజా పునరాగమనం గురించి చర్చించారు.

అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే అత్యుత్తమ ఫలితాలను రాబట్టడానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు. శ్రేయాస్ అయ్యర్ ఆసియా గేమ్స్‌లో పాల్గొననుండటంతో, అతనికి బదులుగా కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం ఇందులో కనిపించే అతిపెద్ద మార్పు. రిషబ్ పంత్ విషయంలో కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ, ధ్రువ్ జురెల్ ఎంపిక బాగుంద‌న్నాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, చాలా మంచి జట్టును ఎంపిక చేశార‌ని ప్ర‌శంసించారు. భారత జట్టు సెలెక్టర్లకు పూర్తి మార్కులు వేయవచ్చు. అని పేర్కొన్నారు. ప్రపంచ కప్‌కు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. రోహిత్ , కోహ్లీ క్రీజులో కుదురుకుంటే వారు పరుగులు సాధిస్తారని, మ్యాచ్‌లు గెలిపిస్తారని, బహుశా ట్రోఫీలను కూడా గెలిపిస్తారని అంచ‌నా వేశారు. ఆల్-రౌండర్ స్థానం పై స్పందిస్తూ రవీంద్ర జడేజా పునరాగమనం మంచిదేన‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!