Google CEO Modi : 10 బిలియ‌న్ డాల‌ర్ల‌తో గూగుల్ సెంట‌ర్

ధ్రువీక‌రించిన సిఇవో సుంద‌ర్ పిచాయ్

Google CEO Modi : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌వాస భార‌తీయుడైన సంస్థ సిఇవో సుంద‌ర్ పిచాయ్ భార‌త దేశానికి ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. అమెరికాలో మోదీ ప‌ర్య‌ట‌నతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ర్య‌ట‌న ముగిసే లోపు ఏకంగా భారీ ఎత్తున పెట్టుబ‌డి పెట్ట‌నున్న‌ట్లు సిఇవో ప్ర‌క‌టించారు. 10 బిలియ‌న్ డాల‌ర్ల‌ను గుజ‌రాత్ లో ఇన్వెస్ట్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

మోదీ టూర్ సంద‌ర్బంగా గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సిఇవో) సుంద‌ర్ పిచాయ్(Sundar Pichai) మర్యాద పూర్వ‌కంగా ప్ర‌ధాన మంత్రిని క‌లిశారు. గుజరాత్ లోని గాంధీ న‌గ‌ర్ లో ఉన్న గుజ‌రాత్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ టెక్ సిటీ లో గూగుల్ గ్లోబ‌ల్ ఫిన్ టెక్ ఆప‌రేష‌న్ సెంట‌ర్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. దీని ఏర్పాటు వ‌ల్ల చిన్న చిన్న వ్యాపార‌స్తుల‌కు ఇది దోహ‌ద ప‌డుతుంద‌ని తెలిపారు.

పీఎం యుఎస్ చారిత్రక ప‌ర్య‌ట‌న‌లో తాను మోదీతో భేటీ కావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు గూగుల్ సిఇవో. డిజిట‌ల్ ప‌రంగా భార‌త దేశం ఇత‌ర దేశాల కంటే ముందంజ‌లో నిలిచింద‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని తాను బ్లూ ప్రింట్ గా భావిస్తున్న‌ట్లు చెప్పారు సుంద‌ర్ పిచాయ్. గూగుల్ 2004లో భార‌త దేశం నుంచి ప‌ని చేస్తోంద‌న్నారు. హైద‌రాబాద్ , గుర్గావ్ , ఢిల్లీ ఎన్సీఆర్ , ముంబై , పూణేతో పాటు బెంగ‌ళూరులో త‌మ కార్యాలయాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.

Also Read : BJP High Command : కాషాయ నేత‌ల‌కు హైకమాండ్ పిలుపు

 

Leave A Reply

Your Email Id will not be published!