CM KCR Visits : విఠ‌ల్ రుక్మిణీ గుడిలో కేసీఆర్ పూజ‌లు

మ‌రాఠా ప‌ర్య‌ట‌న‌లో సీఎం బిజీ బిజీ

CM KCR Visits : బీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మ‌రాఠా పర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. హైద‌రాబాద్ నుంచి అక్క‌డికి బ‌య‌లు దేరి వెళ్లారు. రెండు రోజుల టూర్ లో భాగంగా నిన్న షోలా పూర్ లో బ‌స చేశారు. మంగ‌ళ‌వారం పండ‌రీపూర్ లో పేరు పొందిన శ్రీ విఠ‌ల్ రుక్మిణీ ఆల‌యంలో సీఎం కేసీఆర్ పూజ‌లు చేశారు. ఆయ‌న వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చిన త‌ర్వాత దేశ మంత‌టా విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీలో ప్ర‌ధాన ఆఫీసును ఓపెన్ చేశారు. అక్క‌డి నుంచి నేరుగా మ‌రాఠాపై ఫోక‌స్ పెట్టారు. రాబోయే 2024లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో దేశ మంత‌టా బీఆర్ఎస్ జెండా ఎగుర వేయాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌. ఆ మేర‌కు పావులు క‌దుపుతున్నారు.

బీఆర్ఎస్ క‌ర్ణాట‌క‌లో కూడా కాలు మోపాల‌ని చూసింది. అయితే అక్క‌డ జేడీఎస్ కు మ‌ద్ద‌తు ఇచ్చింది. కానీ తాజాగా జ‌రిగిన ఆ రాష్ట్ర ఎన్నిక‌ల్లో జేడీఎస్ 19 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. కాంగ్రెస్ 135 సీట్లు తెచ్చుకుని బీజేపీకి షాక్ ఇచ్చింది.

ఇక మ‌రాఠాలో ప్ర‌స్తుతం షిండే , బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కొన‌సాగుతోంది. ఇక్క‌డ శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీతో పాటు శ‌ర‌ద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు క‌లిసి మ‌హా వికాస్ అఘాడీగా ఉన్నాయి. ఆయా పార్టీల వారంద‌రినీ బీఆర్ఎస్ లోకి తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. మొత్తంగా ఆయ‌న అనుకున్నారంటే సాధించేంత దాకా వ‌ద‌ల‌రు.

Also Read : Arvind Kejriwal : లా అండ్ ఆర్డ‌ర్ లో కేంద్రం విఫ‌లం

Leave A Reply

Your Email Id will not be published!