Mallikarjun Kharge : తెలంగాణ‌లో మార్పు ఖాయం – ఖ‌ర్గే

ప్ర‌జ‌ల చూపు కాంగ్రెస్ వైపు

Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లో త‌మ మిష‌న్ పూర్త‌యింద‌ని ఇక తెలంగాణ‌నే మిగిలింద‌న్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ బీఆర్ఎస్ అరాచ‌క పాల‌న‌తో విసిగి పోయార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు పూర్తిగా మార్పు కోరుకుంటున్నార‌ని, స్థిర‌మైన పాల‌న ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంద‌ని వారు న‌మ్ముతున్నార‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ చీఫ్‌.

ఇందులో భాగంగా ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకైనా తాము సిద్దంగా ఉన్నామ‌ని అన్నారు. ఉమ్మ‌డి ప్ర‌జాస్వామ్య విలువ‌లు, స‌ర్వోత‌ముఖ‌మైన సామాజిక సంక్షేమం ఆధారంగా తెలంగాణ‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును అందిస్తామ‌ని తెలిపారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge).

ప్రస్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ నాయ‌కులు చేప‌ట్టిన యాత్ర‌కు భారీ ఎత్తున స్పంద‌న ల‌భిస్తోంద‌ని అన్నారు. ప్ర‌భుత్వం అరాచ‌క పాల‌న సాగిస్తోంద‌ని, ఇక కేసీఆర్ వ‌ద్దు అనే స్థాయికి దిగ‌జారింద‌న్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెడుతున్న బీఆర్ఎస్ కు ఈసారి ఓట‌మి ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఖ‌ర్గే.

రాష్ట్రంలో స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే పాల‌నా ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన సీఎం 600 వాహ‌నాల‌తో కాన్వాయ్ నిర్వ‌హించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇది ఏ ర‌క‌మైన ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించారు.

Also Read : DK Shiva Kumar : సిద్ద‌రామ‌య్య భ‌య‌ప‌డ్డారు – డీకే

Leave A Reply

Your Email Id will not be published!