KTR STP : తెలంగాణ ఐటీ , పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మురుగు నీటి శుద్ది కేంద్రం గురించి విశేషాలు పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వంద శాతం మురుగు నీటి శుద్ది కేంద్రం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. దీని ఏర్పాటు ద్వారా దేశంలోనే తొలి ప్రధాన నగరంగా హైదరాబాద్ అవతరించ బోతుందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
ఈ ప్రయత్నంలో భాగంగా తాము రూ. 3,866 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు . 1259.50 ఎంఎల్డీ తో ఎస్టీపీల సంఖ్యను మరికొన్నింటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని కోకా పేటలో 15 ఎంఎల్డీ సామర్థ్యంలో తొలి ఎస్టీపీనీ ఇవాళ ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు కేటీఆర్(KTR). ఇక ఈ స్కీంలో భాగంగా భారీ ఎత్తున నిర్మించిన ఎస్టీపీలను దశల వారీగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఇక రోజు రోజుకు హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. రియల్ ఎస్టేట్ పరంగా కూడా ప్రాధాన్యత పెరిగింది. భారీ ఎత్తున ఆకాశ హార్మ్యాలు కొలువు తీరాయి. కోట్లల్లో ధరలు పలుకుతున్నాయి. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, టెలికాం, తదితర రంగాలకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ ఏర్పాటు అయ్యాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఉపాధి కోసం హైదరాబాద్ కు తరలి వచ్చారు. రోజు రోజుకు జనాభా పెరుగుతుండడంతో మురుగు నీరు ఇబ్బంది పెడుతోంది. దీనికి పరిష్కార మార్గంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్టీపీలను నిర్మిస్తోంది.
Also Read : Jailer Movie Song : తలైవా జైలర్ సాంగ్ పై ఉత్కంఠ
